పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత

|

Oct 13, 2020 | 7:01 PM

ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎడతెరిపి లేని వానాలతో భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత
ఈ వ్యవహారం కేంద్ర జలశక్తి శాఖ దగ్గరకు కూడా వెళ్లింది. NGT సీరియస్‌ అయింది. దీంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సర్వేకు సిద్ధమవుతోంది కృష్ణా బోర్డు. ఈలోపు రెండు వైపులా మంత్రుల కామెంట్లు మరింత హీట్‌ను పెంచుతున్నాయి.
Follow us on

ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎడతెరిపి లేని వానాలతో భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారింది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో అంతకంతకు పెరుగుతుండటంతో క్రస్టుగేట్లను ఎత్తి ప్రవాహాన్ని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ఇందిరా ప్రియదర్శిని జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3.60 లక్షల క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు చేరుతుంది . శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 885 అడుగులు (215.8 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 884.7 అడుగులు 213.7 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అటు, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి నుంచి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశముండటం, బీమాతోపాటు పలు కృష్ణా ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రేపటికల్లా శ్రీశైలానికి సుమారు 10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు గేట్లను తెరిచి నీటిని విడుల చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు నీటి ప్రవాహంపై ఇంజినీరింగ్‌ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.