కరోనా వైరస్ ప్రపంచంపై విరుచుకుపడి 10 నుంచి 11 నెలలు గడుస్తోంది. ఈ మహమ్మారిపై అప్పట్నుంచి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి అరికట్టే మెడిసిన్‌తో పాటు రాకుండా చేసే వ్యాక్సిన్..ఏ వయసు వారిలో కరోనా ప్రభావం ఎక్కువ ఉంటుంది వంటి ఎన్నో అంశాలపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. కొత్త పరిశోధన ప్రకారం పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడని వారు కోవిడ్ -19 సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందట. అంతే కాదు, పెళ్లి కానివారు కరోనాతో మరణించే ప్రమాదం కూడా ఎక్కువేనట.
పెళ్లికాని వారి జీవనశైలి సరిగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని పరిశోధనలో తేలింది. జీవనశైలి కారణంగానే చాలా మంది పెళ్లికానివారికి… వివాహితుల కంటే రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అంటే, వారి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. దీంతో కరోనా వైరస్ వంటి అంటు వ్యాధులు చాలా త్వరగా అటాక్ అవుతాయి.
‘ది నేచర్’ పత్రికలో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, పదేపదే అనారోగ్యం కారణంగా, పెళ్లికాని వారి మానసిక స్థితి ప్రభావితమవుతుంది. ఈ కారణంగా, జీవిత భాగస్వామి గురించి ఆకర్షణ తగ్గుతుంది. యువతలో వివాహం పట్ల ఆసక్తి లేకపోవడానికి ఇది ప్రధాన కారణం కావచ్చు.
స్వీడన్ స్టాక్హోమ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన జీవితంలోని అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. వీటిలో కరోనా బారిన పడిన ప్రజల ఆర్థిక, సామాజిక, మానసిక, శారీరక పరిస్థితులు.. మరణాల తీరును అంచనా వేసి..ఈ నిర్ణయానికి వచ్చింది.
వివాహితులతో పోలిస్తే పెళ్లికానివారికి కరోనా వల్ల మరణించే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది కాకుండా, తక్కువ చదువుకున్న, తక్కువ ఆదాయ ప్రజలలో కరోనా సంక్రమణ తరువాత మరణించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఏదేమైనా, ఈ పరిశోధన భారతదేశానికి పూర్తిగా వర్తించదు. ఎందుకంటే మన దేశంలో తక్కువ స్థాయి విద్య, ఆదాయం ఉన్నప్పటికీ… అవివాహితులు అయినప్పటికీ కుటుంబ మద్దతు చాలా ఎక్కువగా ఉంటుంది.
(Note : ఈ సమాచారం అధ్యయనం నుంచి సేకరించబడింది. కరోనా గురించి ఎటువంటి సమస్యలైనా, సందేహాలున్నా వైద్య నిపుణులను సంప్రదించండి)
Also Read :
డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్
ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు..పూర్తి విధానం ఇదే..రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్
ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు