ధోని వారసుడు అతడేనట.. తెరపైకి కొత్త పేరు.!

మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ జట్టుకు తలా ఎన్నో అపురూపమైన విజయాలను అందించాడు. ధోని సారధ్యంలోనే టీమిండియా రెండు ప్రపంచకప్‌లను గెలుచుకోవడమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీని సైతం సొంతం చేసుకుంది. మరోవైపు ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. ఒకవైపు ఎండ్ నుంచి వికెట్లు పడుతున్నా.. ధోని చాలా కూల్‌గా జట్టును విజయతీరాలకు చేర్చిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి […]

ధోని వారసుడు అతడేనట.. తెరపైకి కొత్త పేరు.!
Follow us

|

Updated on: May 30, 2020 | 1:56 PM

మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ జట్టుకు తలా ఎన్నో అపురూపమైన విజయాలను అందించాడు. ధోని సారధ్యంలోనే టీమిండియా రెండు ప్రపంచకప్‌లను గెలుచుకోవడమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీని సైతం సొంతం చేసుకుంది. మరోవైపు ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. ఒకవైపు ఎండ్ నుంచి వికెట్లు పడుతున్నా.. ధోని చాలా కూల్‌గా జట్టును విజయతీరాలకు చేర్చిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి లెజండరీ క్రికెట్ చాలా రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. దీనితో అతడి స్థానాన్ని భర్తీ చేసే సామర్ధ్యం కలిగిన ఆటగాడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలోనే యువ క్రికెట్ రిషబ్ పంత్ పేరు తెరపైకి వచ్చింది. చాలామంది క్రికెటర్లు అతనిపై నమ్మకం ఉంచారు కూడా.. కానీ పంత్ వారి అంచనాలను అందుకోలేకపోయాడు.

ఇక ఇప్పుడు తాజాగా మరో యువ క్రికెట్ పేరు తెరపైకి వచ్చింది. ధోని స్థానాన్ని అతడు ఖచ్చితంగా భర్తీ చేయగలడని వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. గతేడాది రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రియాన్ పరాగ్ పేరును అతడు తెరపైకి తెచ్చాడు. 2019లో పరాగ్ రాజస్తాన్ తరపున చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అతని గురించి ఊతప్ప ప్రస్తావిస్తూ.. ధోని స్థానాన్ని పరాగ్ భర్తీ చేయగలడని చెప్పుకొచ్చాడు. తనలో ఆ సత్తా ఉందని.. అతన్ని భారత్ జట్టులో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఊతప్ప తెలిపాడు. పరాగ్ జాతీయ జట్టుకు సుదీర్ఘ కాలం పాటు ప్రాతినిధ్యం వహిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పాడు. కాగా, ఆస్ట్రేలియా క్రికెట్ స్టీవ్ స్మిత్ కూడా రియాన్ పరాగ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఖచ్చితంగా పరాగ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని.. మంచి అవగాహన కలిగిన క్రికెటర్ అని మెచ్చుకున్నాడు.

Also Read:ఇకపై స్కూల్స్ 100 రోజులు..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో