జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకలతో ప్రాణాలకు తెగించి పోరాడి వీరమరణం చెందిన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి నిన్న ఉదయం చివరిసారిగా భార్య రజితకు ఫోన్ చేశారు. టెర్రరిస్టులతో జరిగే ఆపరేషన్ లో పాల్గొంటున్నానని ఫోన్ చేసి చెప్పారు ప్రవీణ్ కుమార్ రెడ్డి. చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లికు చెందిన హవల్దార్ ప్రవీణ్.. పదిహేడేళ్లుగా ఆర్మీలో పని చేస్తున్నారు. పదమూడేళ్లపాటు కశ్మీర్లోనే పని చేశారు. NSG నేషనల్ సెక్యూరిటీగార్డ్స్ లో మూడేళ్లపాటు కమాండోగా సేవలందించారు. పూంచ్ సెక్టార్ బెటాలిక్ లోనూ పని చేసిన ప్రవీణ్.. సిపాయిగా ఆర్మీలో చేరి హవాల్దార్ స్థాయికి ఎదిగారు. 18 మద్రాస్ ఇంఫెంట్రీ విభాగంలో హవాల్దార్ గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌కు పదేళ్ల క్రితం వివాహం అయింది. ఆయనకు ఇద్దరు పిల్లలు. భర్త మరణవార్త విని భార్య రజిత, కుటుంబసభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపొయారు. ఉగ్రమూకలతో పోరాడి వీరమరణం పొందిన ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్