మీకు న్యూమోనియా(నిమ్ము) ఉందా ? వర్షాకాలం, శీతాకాలం వస్తే ఇబ్బందిగా ఉంటుందా ? భయపడకండి.. ఇంటి వద్దే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ న్యూమోనియాను తగ్గించుకోవచ్చు. అంతకంటే ముందు న్యూమోనియా గురించి తెలుసుకుందాం. ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ నే న్యూమోనియా అంటారు. ఊపిరితిత్తుల్లో ఆల్వియోలి ద్రవం లేదా చీముతో నిండిపోయి ఉన్నప్పుడు శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. మనం పీల్చే గాలిలో బ్యాక్టీరియా, వైరస్ లు, ఇతర సూక్ష్మజీవుల వల్ల న్యూమోనియా రావొచ్చు. న్యూమోనియా ఎక్కువగా పిల్లలు, వృద్ధుల్లో ఉంటుంది. అశ్రద్ధ చేస్తే అది ప్రాణాంతకమయ్యే ప్రమాదం కూడా ఉంది.
-న్యూమోనియాలోనూ కొన్నిరకాలుంటాయి. బ్యాక్టీరియల్ న్యూమోనియా, వైరల్ న్యూమోనియా, ఫంగల్ న్యూమోనియా వంటివి ప్రధానమైనవి. ధూమపానం, మద్యపానం ఎక్కువగా చేసేవారికి ఫంగల్ న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది.
-కఫంతో కూడిన దగ్గు, చలి, వణుకు, జ్వరం, నీరసంగా ఉండటం, ఛాతీలో నొప్పి రావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం, వాంతులు, వికారం, విరేచనాలు కావడం న్యూమోనియా లక్షణాలు.
-ఒకరి నుంచి మరొకరికి న్యూమోనియా సోకకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సామాజిక దూరం, దగ్గేటపుడు, తుమ్మేటపుడు ముక్కు, నోటిని మాస్క్ తో కవర్ చేసుకోవాలి. వ్యాధిసోకిన వారి వస్తువులను ఇతరులు వాడకూడదు. న్యుమోనియో సోకిన వారిని తాకిన అనంతరం హ్యాండ్ వాష్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.
-కొన్ని ఇంటి చిట్కాలతో న్యూమోనియాను నయం చేసుకోవచ్చు. సూప్ లు, టీలు తాగడం.. తేనె- వేడినీరు-నిమ్మరసం కలిపి తాగడం ద్వారా న్యూమోనియా నుండి ఉపశమనం పొందవచ్చు. న్యూమోనియా ఉన్నవారు త్వరగా అలసిపోతారు కాబట్టి వీరికి విశ్రాంతి ఎక్కువ అవసరం.
-శీతల పానీయాలు, ఐస్ క్రీమ్ లు, కూల్ వాటర్ కు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కాచి చల్లార్చిన నీటినే తీసుకోవాలి.
-నిద్రించేటపుడు శరీరం కంటే తల, ఛాతీని కొంత ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
-ముఖ్యంగా ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలి. హ్యుమిడిఫైయర్లు వాడటం అలవాటు చేసుకోవాలి. లేదా తరచూ వేడి నీటితో ఆవిరి పడుతూ ఉండాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..