దేవుడ్ని నేనేమీ కోరలేదు..మరి..ఎందుకీ ధ్యానముద్ర ?

| Edited By: Srinu

May 19, 2019 | 5:16 PM

ప్రధాని మోదీ  కేదార్ నాథ్ ఆలయ గుహల్లో శనివారమంతా ధ్యానముద్రలో గడిపారు. మోక్షానికి దగ్గరి దారి ధ్యానమే అంటూ రోజంతా ఓ ‘ సన్యాసి ‘ గా మారిపోయారు. ఈ ‘ రాజకీయ సన్యాసి ‘ తన ధ్యానం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..కేదార్నాథ్ అంటే తనకెంతో ఇష్టమని, ఈ ధ్యానంలో తాను దేవుడ్ని ఏమీ కోరలేదని తెలిపారు. ఆ భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేలా నాకు వరమిమ్మని నేనేమీ కోరలేదు. […]

దేవుడ్ని నేనేమీ కోరలేదు..మరి..ఎందుకీ ధ్యానముద్ర ?
Follow us on
ప్రధాని మోదీ  కేదార్ నాథ్ ఆలయ గుహల్లో శనివారమంతా ధ్యానముద్రలో గడిపారు. మోక్షానికి దగ్గరి దారి ధ్యానమే అంటూ రోజంతా ఓ ‘ సన్యాసి ‘ గా మారిపోయారు. ఈ ‘ రాజకీయ సన్యాసి ‘ తన ధ్యానం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..కేదార్నాథ్ అంటే తనకెంతో ఇష్టమని, ఈ ధ్యానంలో తాను దేవుడ్ని ఏమీ కోరలేదని తెలిపారు. ఆ భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేలా నాకు వరమిమ్మని నేనేమీ కోరలేదు. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. దుబాయ్, సింగపూర్ వెళ్ళగోరేవారు కేదార్ నాథ్ ఆలయాన్ని కూడా సందర్శించాలని నేను భావిస్తున్నా..అని మోడీ పేర్కొన్నారు. మరి..మొన్నటికి మొన్న కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని, తాము హిస్టరీ క్రియేట్ చేస్తామని, ప్రజలు మళ్ళీ సుస్థిర పాలననే కోరుకుంటున్నారని చెప్పిన మోదీ..ఇప్పుడిలా పూర్తి స్థాయి సాధువులా మాట్లాడడమేమిటని అంతా నోళ్లు నొక్కుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆట్టే రోజులు లేని ఈ తరుణంలో ఈ ‘ ధ్యాన ముద్రలు, ఈ ‘ వైరాగ్య పోకడలు ‘ ఎందుకో మరి అన్న ప్రశ్నలను సంధిస్తున్నారు.