గెలిచేదెవరు..? నిలిచేదెవరు..?

|

Oct 26, 2019 | 11:24 AM

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఎన్నో పరిణామాలను చూపుతాయి. ముఖ్యంగా ఈ ఫలితాలు బీజేపీకి చాలా అవసరం. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ సంపూర్ణ విజయం సాధించి కాబట్టి.. ఇప్పుడు కూడా అలాంటి విజయమే సాధించాలి. అంతేకాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ, గత రెండు మూడు నెలల నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద విజయం […]

గెలిచేదెవరు..? నిలిచేదెవరు..?
Follow us on

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఎన్నో పరిణామాలను చూపుతాయి. ముఖ్యంగా ఈ ఫలితాలు బీజేపీకి చాలా అవసరం. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ సంపూర్ణ విజయం సాధించి కాబట్టి.. ఇప్పుడు కూడా అలాంటి విజయమే సాధించాలి. అంతేకాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ, గత రెండు మూడు నెలల నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద విజయం సాధించబోతున్నామని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అన్ని చోట్ల చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ మాటలపై, బీజేపీ గెలుపుపై జనాల్లో నమ్మకం ఉన్నప్పటికీ.. అంత పెద్ద విజయాన్ని సాధిస్తారా..? అన్నది అనుమానంగానే ఉంది.

ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ తగ్గుముఖం పట్టగా.. నిరుద్యోగంతో పాటు ఇంకా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం బీజేపీ మీద బాగా పడుతుంది. దీని వలన బీజేపీ పెద్ద విజయం సాధించలేదన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. అందువల్లనే ఏ తప్పు చేయకూడదని భావించిన మోదీ, అమిత్ షా.. గత 20 రోజుల్లో చాలా ఎక్కువ సార్లు హర్యానా, మహరాష్ట్ర తిరిగి ప్రచారం చేశారు. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి నాయకులను బీజేపీలోకి రప్పించుకొని గొప్ప విజయం సాధించాలని.. ఫుల్ ఎఫెర్ట్ చేస్తున్నారు. అందువల్ల ఇవాళ సాయంత్రం నుంచి వచ్చే సర్వే రిజల్ట్ బీజేపీపై ప్రభావాన్ని చూపుతాయి.

ఇక మిగిలిన పార్టీల విషయానికొస్తే.. 2014 వరకు 15 సంవత్సరాలుగా హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటూ వచ్చింది. అందువల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర, హర్యానాలో గెలవకపోయినా.. మంచి ఫైట్ అయినా ఇవ్వాలి. అలా కాకపోతే ఈ పార్టీ భవిష్యత్‌లో చాలా కష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో 1972 నుంచి శరద్ పవార్ దాదాపు 50 సంవత్సరాలు ఓ పెద్ద నాయకుడిగా కాలం గడిపారు. ఇక ఈసారి గనుక ఎన్పీపీ పర్ఫార్మెన్ బాగోకపోతే ఎన్సీపీ మాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక హర్యానా విషయాని కొస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నమాజీ ముఖ్యమంత్రి ఉపేంద్ర హుడా.. అలాగే అక్కడి మాజీ ముఖ్యమంత్రుల భన్సీ లాల్, భజన్ లాల్ కుటుంబాలకు ఎన్నికల గెలుపు చాలా ముఖ్యం. లేకపోతే వారికి కూడా రాజకీయ భవిష్యత్ ఉండదు. అందువల్ల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదంతా ఫలితాలు వచ్చాకే స్పష్టంగా తెలుస్తోంది. ఇక పోటీ అన్న తరువాత అందరూ గెలవలేరు కాబట్టి ఓటమి భరించే వారి భవిష్యత్ పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఏఏ పార్టీ భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ నెల 24వరకు ఆగాలి.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి. అవి టివీ9 వెబ్‌సైట్ అభిప్రాయాలుగా పరిగణించవద్దని మనవి.