Haritha Hotels: లీజుకు తెలంగాణ హరిత హోటళ్లు… మీకు ఆసక్తి ఉందా.. అయితే ఇలా అప్లై చేసుకోండి..

రాష్ట్రంలోని పది హరిత హోటళ్లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ శాఖ ఎండీ మనోహర్‌రావు ప్రకటించారు. హోటళ్ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోసం ఆసక్తిగలవారు...

Haritha Hotels: లీజుకు తెలంగాణ హరిత హోటళ్లు... మీకు ఆసక్తి ఉందా.. అయితే ఇలా అప్లై చేసుకోండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 19, 2021 | 8:25 AM

Haritha Hotels For Lease: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత హోటళ్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలతో పాటు జాతీయ రహదారులపై ఈ హోటళ్లు సేవలు అందిస్తున్నాయి. తాజాగా వీటి నిర్వహణలో ప్రైవేటు వ్యక్తులను భాగస్వామ్యం చేయడానికి పర్యాటక శాఖ ఒక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పది హరిత హోటళ్లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ శాఖ ఎండీ మనోహర్‌రావు ప్రకటించారు. హోటళ్ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోసం ఆసక్తిగలవారు ఫిబ్రవరి 17లోపు తమ అభ్యర్థనను (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) పంపించాలని తెలిపారు. ఇందుకోసం www.tourism.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు. ఇక ఫిబ్రవరి 22న ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించి అర్హులకు బాధ్యతలు ఇస్తామని పేర్కొన్నారు. సింగోటం, సోమశిల, ఉమామహేశ్వరం, మన్ననూరు, ఈగలపెంట, గట్టమ్మ, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగత హోటళ్లను లీజు తీసుకోవడానికి అవకాశం కల్పించారు.

Also Read: ఆ కల్లులో ప్రమాదకరమైన రసాయనాలు.. అందుకే మరణాలు.. ల్యాబ్ రిపోర్ట్‌లోని వివరాలు ఇవే