ఉగ్రవాదుల కాల్పులు.. ఆరుగురు ఫ్రెంచ్ దేశీయుల దుర్మరణం

|

Aug 10, 2020 | 9:20 AM

ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జూపార్కులో గుర్తుతెలియని ఉగ్రవాదులు విచక్షారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు ఫ్రెంచ్ దేశీయులు మరణించారు.

ఉగ్రవాదుల కాల్పులు.. ఆరుగురు ఫ్రెంచ్ దేశీయుల దుర్మరణం
Follow us on

ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జూపార్కులో గుర్తుతెలియని ఉగ్రవాదులు విచక్షారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు ఫ్రెంచ్ దేశీయులు మరణించారు. ఈ విషాద ఘటన పశ్చిమ ఆఫ్రికా దేశంలోని నిగర్ నగర జిరాఫీ జూ పార్కులో చోటుచేసుకుంది. కౌరే ప్రాంతంలో అంతర్జాతీయ సహాయ బృందంలో పనిచేస్తున్న ఆరుగురు ఫ్రెంచ్ పౌరులు నిగర్ నగరంలోని జిరాఫీ జూపార్కును చూసేందుకు వచ్చారు. జిరాఫీ పార్కులో ఉన్న ఫ్రాన్స్ పౌరులపై మోటారుసైకిళ్లపై వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు ఫ్రాన్స్ దేశీయులతో పాటు స్థానిక టూరిస్టు గైడ్, డ్రైవరు మరణించారని ఆఫ్రికా తిల్లాబరి ప్రాంత గవర్నరు టిడ్జనీ ఇబ్రహీం ధృవీకరించారు.

తమ దేశ పౌరులు ఆఫ్రికా కాల్పుల్లో మరణించిన ఘటనతో ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆఫ్రికా దేశ ప్రతినిధి మహమ్మద్ ఇస్సౌఫౌతో మాట్లాడిన ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో ఉగ్రవాదుల ముప్పు ఉన్న ఆఫ్రికా దేశంలో ఫ్రెంచ్ పౌరులు ప్రయాణించవద్దని ఫ్రాన్స్ తమ దేశ పౌరులకు సూచించింది. ఈ కాల్పులు జరిపింది ఏ గ్రూపు ఉగ్రవాదులో అధికారికంగా వెల్లడించలేదు. బోకో హరామ్ తో సహా అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు తరచూ ఆఫ్రికాలో దాడులకు పాల్పడుతున్నారు.