రాజస్తాన్ లో ఉధృతమవుతున్న గుజ్జర్ల ఆందోళన

ఉద్యోగాలు, విద్యలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాజస్థాన్ లో గుజ్జర్లు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. గుజ్జర్ అరక్షణ్ సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సోమవారం భరత్ పూర్ లోని బయానా ప్రాంతంలో వందలమంది నిరసనకారులు రైలు పట్టాలపై బైఠాయించారు. వీరి నిరసనతో ఏడు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరోవైపు అనేక జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేశారు. రాబోయే రోజుల్లో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని గుజ్జర్ అరక్షణ్ సంఘర్ష్ […]

రాజస్తాన్ లో ఉధృతమవుతున్న గుజ్జర్ల ఆందోళన

Edited By:

Updated on: Nov 02, 2020 | 4:41 PM

ఉద్యోగాలు, విద్యలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాజస్థాన్ లో గుజ్జర్లు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. గుజ్జర్ అరక్షణ్ సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సోమవారం భరత్ పూర్ లోని బయానా ప్రాంతంలో వందలమంది నిరసనకారులు రైలు పట్టాలపై బైఠాయించారు. వీరి నిరసనతో ఏడు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరోవైపు అనేక జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేశారు. రాబోయే రోజుల్లో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని గుజ్జర్ అరక్షణ్ సంఘర్ష్ సమితి హెచ్చరించింది.