గ్రీస్ లో కరోనా కొత్త కేసులు.. ఇదే కారణమా..?

తగ్గమొఖం పడుతుందనుకుంటున్న మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మూడు నెలల పాటు లాక్ డౌన్ లోకి వెళ్లిన దేశాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుని లావాదేవీలు కొనసాగిస్తుండగా మరోసారి కరోనా రాకాసి విస్తరిస్తుంది. తాజాగా పర్యాటకుల కోసం సరిహద్దులు తెరవడంతో గ్రీస్‌లో మరోమారు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే గ్రీస్ వ్యాప్తంగా కొత్తగా 264 కరోనా కేసులు నమోదయ్యాయి.

గ్రీస్ లో కరోనా కొత్త కేసులు.. ఇదే కారణమా..?

Updated on: Aug 23, 2020 | 1:54 PM

తగ్గమొఖం పడుతుందనుకుంటున్న మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మూడు నెలల పాటు లాక్ డౌన్ లోకి వెళ్లిన దేశాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుని లావాదేవీలు కొనసాగిస్తుండగా మరోసారి కరోనా రాకాసి విస్తరిస్తుంది. తాజాగా పర్యాటకుల కోసం సరిహద్దులు తెరవడంతో గ్రీస్‌లో మరోమారు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే గ్రీస్ వ్యాప్తంగా కొత్తగా 264 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 29 కేసులు సరిహద్దుల నుంచి వస్తున్న పర్యాటకుల నుంచి నమోదైనట్టు నేషనల్ పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. దేశంలో ఆర్థిక రంగాన్ని మెరుగుపరిచేందుకు జూలైలో గ్రీస్ ప్రభుత్వం కొన్ని దేశాలపై ఆంక్షలు ఎత్తివేసింది. తక్కువ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి పర్యాటకులు గ్రీస్ లోకి అనుమతినిచ్చింది. అయితే, పర్యాటకుల రాకతో ఆగస్టు నెలలో మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. దీంతో గ్రీస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మళ్లీ పలు ఆంక్షలను విధించింది. కాగా, గ్రీస్‌లో ఇప్పటివరకు మొత్తం 8,381 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం కరోనా బారిన పడి ఇద్దరు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 240కు చేరుకుంది.