మనవడిని చంపిన తాత, కార‌ణం ఏంటంటే?

|

Sep 06, 2020 | 3:23 PM

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాగి వచ్చి రోజూ వేధిస్తున్నాడని మనవడుని తాత చంపేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

మనవడిని చంపిన తాత,  కార‌ణం ఏంటంటే?
Follow us on

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాగి వచ్చి రోజూ వేధిస్తున్నాడని మనవడుని తాత చంపేయ‌డం క‌ల‌క‌లం రేపింది. బేస్తవారిపేట మండలం కాజీపురం గ్రామంలో ఓ వ్య‌క్తి చెడు వ్య‌స‌నాల‌కు బానిస అయ్యాడు. నిత్యం తాగి వ‌చ్చి ఇంట్లో వాళ్లని వేధిస్తూ ఉండేవాడు. డ‌బ్బుల కోసం కుటుంబ స‌భ్యుల్ని చిత్ర హింసలు పెడుతుండేవాడు. అత‌డి వేధింపులు భరించలేక‌ తల్లిదండ్రులు, అతని తాత చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే శనివారం రాత్రి తాగి వచ్చిన మనవడిని నిద్రలో ఉండగా కొట్టి చంపాడు తాత. ఘ‌ట‌నకు సంబంధించి మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Also Read :

జ‌గ‌న్‌పై దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు

క‌రోనా సోకింద‌ని అమ్మ‌ను పొలం వ‌ద్ద వ‌దిలేశారు