
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వాగులో పడి తాత మనవడు మృత్యువాతపడ్డారు. గంభీరావుపేటలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
గంభీరావుపేటకు చెందిన రైతు మల్లయ్య(55) ఇంటి వద్ద ఆడుకుంటున్న మనవడు నందన్(9)ను వెంట తీసుకుని వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు బయలుదేరారు. మానేరు వాగు వద్దకు చేరుకున్న ఇద్దరు ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడి ఇద్దరూ మృతిచెందారు. పొలం వద్ద మోటారు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు తిరిగి రాకపోవడంతో ఖంగారుపడ్డ కుటుంబసభ్యులు వారికోసం వెతకగా మానేరువాగులో శవమై కనిపించారు. దీంతో స్థానికుల సాయంతో ఇద్దరి శవాలను వెలికితీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి తాతామనవల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.