వైభవంగా తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమల‌ శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది. వీటిని ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభం కాగా, తొలి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను శ్రీవారు అనుగ్రహించారు. రెండో రోజు ఆదివారం రుక్మిణీ సమేత […]

వైభవంగా తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2019 | 4:50 PM

తిరుమల‌ శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది. వీటిని ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభం కాగా, తొలి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను శ్రీవారు అనుగ్రహించారు. రెండో రోజు ఆదివారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడిగా తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.

తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సందర్భంగా మూడో రోజు సోమవారం సాయంత్రం మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా కోనేటిలో విహరించారు. ముందుగా సర్వాలంకార భూషితుడైన మలయప్ప దేవేరులతో కలసి నాలుగు మాడ‌వీధులలో ప్రదక్షిణగా పుష్కరిణిలోని తెప్పలోకి వేంచేశారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదపారాయణ, అన్నమయ్య కీర్తనాలాపనల నడుమ పుష్కరిణిలో తెప్పోత్సవం మూడుసార్లు కనులపండువగా సాగింది. వేలాది మంది భక్తులు ఉత్సవాన్ని తిలకించి స్వామికి నీరాజనాలు పట్టారు. నాలుగో రోజు మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి తెప్పపై ఐదు ప్రదక్షిణలు చేయనున్నారు.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!