AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిక్‌టాక్‌కు ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చిన పాకిస్తాన్‌ ప్రభుత్వం

పబ్జీ వీడియో గేమ్‌ను నిషేధించిన పాకిస్తాన్‌ ఇప్పుడు టిక్‌టాక్‌పై పడింది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందన్న కారణంతో పబ్జీని నిషేధించిన పాకిస్తాన్‌ టిక్‌టాక్‌పై కూడా అదే అభియోగాన్ని మోపుతోంది.

టిక్‌టాక్‌కు ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చిన పాకిస్తాన్‌ ప్రభుత్వం
Balu
|

Updated on: Jul 21, 2020 | 2:04 PM

Share

పబ్జీ వీడియో గేమ్‌ను నిషేధించిన పాకిస్తాన్‌ ఇప్పుడు టిక్‌టాక్‌పై పడింది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందన్న కారణంతో పబ్జీని నిషేధించిన పాకిస్తాన్‌ టిక్‌టాక్‌పై కూడా అదే అభియోగాన్ని మోపుతోంది. టిక్‌టాక్‌లో అసభ్యత, అశ్లీలత హద్దులు దాటకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌ను ఆదేశించింది పాకిస్తాన్‌ ప్రభుత్వం. పబ్జీ, టిక్‌టాక్‌లే కాదు సోషల్‌మీడియాలోని పలు యాప్స్‌లో అసభ్య కంటెంట్‌ ఉంటున్నదంటూ బోలెడన్ని ఫిర్యాదులు వస్తున్నాయని పాకిస్తాన్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ అథారిటీ అంటోంది. ఎక్కువ మట్టుకు టిక్‌టాక్, బిగోలోనే అడల్ట్‌ కంటెంట్‌ ఉంటోందట! ఈ కారణంగా యువత చెడుదారి పట్టే అవకాశాలు ఉన్నాయన్నది పీటీఏ కంప్లయింట్‌. ఇప్పటికే ఈ విషయంపై ఆయా సంస్థలకు నోటీసులు ఇచ్చామని చెబుతోంది. అయితే తమ నోటీసులకు అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్‌ రావడం లేదని, దీంతో ఇప్పటికే బిగోను నిషేధించామని పీటీఏ చెబుతోంది. టిక్‌టాక్‌కు ఆఖ‌రి హెచ్చ‌రిక జారీ చేశామని, టిక్‌టాక్‌లో మితిమీరుతున్న అశ్లీల‌తను, అస‌భ్య‌త‌ను, అనైతిక వీడియోల‌ను నియంత్రించేందుకు స‌మ‌గ్ర‌మైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించామ‌ని పాకిస్తాన్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ అథారిటీ అంటోంది. మనం కూడా దేశ‌ స‌మ‌గ్ర‌త‌కు ముప్పు వాటిల్లుతుంద‌న్న కార‌ణంతో టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేశాం. దీంతో పాటు చైనాకు చెందిన మ‌రో 58 యాప్‌ల‌పై నిషేధం విధించాం.

Follow Us
వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం..
వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం..
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
మండపంలో ప్రియుడు.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు.. చివరకు
మండపంలో ప్రియుడు.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు.. చివరకు
వామ్మో.. ఆ వర్కవుట్స్ ఏందీ మేడమ్.. నెటిజన్స్ రియాక్షన్ చూశారా..
వామ్మో.. ఆ వర్కవుట్స్ ఏందీ మేడమ్.. నెటిజన్స్ రియాక్షన్ చూశారా..
చూసి ఇదేం మూవీ అన్నారు.. ఇప్పటికీ యూత్ పెద్ద ప్యాన్స్..
చూసి ఇదేం మూవీ అన్నారు.. ఇప్పటికీ యూత్ పెద్ద ప్యాన్స్..
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..? ప్రధాని మోదీ అలర్ట్ వెనుక ఆంతర్యం ఇదేనా
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..? ప్రధాని మోదీ అలర్ట్ వెనుక ఆంతర్యం ఇదేనా
మరోసారి కుప్పకూలిన మార్కెట్‌.. కారణం?
మరోసారి కుప్పకూలిన మార్కెట్‌.. కారణం?
శభాష్ పూజిత.. లండన్ గడ్డపై కౌన్సిలర్‌‌గా గెలిచిన ఓరుగల్లు బిడ్డ..
శభాష్ పూజిత.. లండన్ గడ్డపై కౌన్సిలర్‌‌గా గెలిచిన ఓరుగల్లు బిడ్డ..
గజలక్ష్మీ–రుచక యోగం కలయికతో అసాధారణ రాజయోగం! ఈ రాశులకు గోల్డెన్ ట
గజలక్ష్మీ–రుచక యోగం కలయికతో అసాధారణ రాజయోగం! ఈ రాశులకు గోల్డెన్ ట
పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు కారణాలు
పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు కారణాలు