
పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం కొనసాగుతోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటం… దీనికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో జిల్లాలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటికే చాలా గ్రామాలు నీటిలో తడిసి ముద్దవుతున్నాయి.
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన గోష్పాద క్షేత్రం గోదావరి వరద నీటిలో చిక్కుకుంది. కొవ్వూరులోని ఈ క్షేత్రానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు, అపరకర్మల నిమిత్తం వస్తుంటారు. అయితే వరద పోటుతో అధికారులు భక్తులను అనుమతించడంలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా ఈ క్షేత్రానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అన్ని రోజుల్లో గోష్పాద క్షేత్రానికి భక్తులు వస్తుంటారు. పుష్కరాల సమయంలో ఈ గోష్పాద క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ క్షేత్రం ఒక కి.మీ. పొడవు ఉంటుంది. ఇందులో అనేక దేవాలయాలు ఉన్నాయి. శివాలయం, సాయిబాబా మందిరం, కృష్ణాలయం.. ఇలా దాదాపు 20 దేవాలయాలు కొలువుతీరి ఉన్నాయి.