పట్టాలు తప్పిన గోరఖ్‌పూర్-కోల్‌కతా పూజా స్పెషల్ రైలు

గోరఖ్‌పూర్-కోల్‌కతా 05048 పూజా ప్రత్యేక రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని సిలాబ్‌, సిహూ మ‌ధ్య మంగ‌ళ‌వారం సాయంత్రం చోటుచేసుకుంది.

పట్టాలు తప్పిన గోరఖ్‌పూర్-కోల్‌కతా పూజా స్పెషల్ రైలు
Follow us

|

Updated on: Oct 20, 2020 | 10:43 PM

గోరఖ్‌పూర్-కోల్‌కతా 05048 పూజా ప్రత్యేక రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని సిలాబ్‌, సిహూ మ‌ధ్య మంగ‌ళ‌వారం సాయంత్రం చోటుచేసుకుంది. రైలులోని రెండు బోగీలు (ఏసీ కోచ్‌, స్లీప‌ర్ కోచ్‌) ప‌ట్టాలు త‌ప్పాయి. సిలాట్ – సిహో మధ్య సిలాట్ రైల్వే స్టేషన్ సమీపంలోని రఘునాథ్ పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ, ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ముజఫర్పూర్ నుండి సమస్తిపూర్ వైపు రైలు వెళుతుండగా ఒక్కసారిగా శబ్ధాలు వచ్చాయి. దీంతో కో – పైలట్ జాగ్రత్తగా రైలు వేగాన్ని తగ్గించి ఆపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ముజఫర్‌పూర్ స్టేషన్ నుంచి బయలుదేరిన తరువాత, రెండు ఎసి బోగీలు రైల్వే ట్రాక్‌ల పైన రెండు అడుగుల దూరం దూకినట్లు గుర్తించగా, రైలు నడుస్తూనే ఉన్నట్లు గోరఖ్‌పూర్ నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఒకరు రాజేష్ సింగ్ తెలిపారు. డ్రైవర్ నెమ్మదిగా రైలును ఆపాడు, ఎటువంటి ప్రమాదాలు జరగలేదన్నారు

రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది:

సమస్తిపూర్: 06274-232227

ముజఫర్‌పూర్: 8340644986

సోన్‌పూర్: 06158-221645, 06158-262960

హాజీపూర్: 06224-272230

ఝాఝా: 7070037919