వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా ప్రభాస్.. రూ. కోటి 50 ల‌క్ష‌లు విరాళం

హైదరాబాద్ మహాన‌గ‌రంలో వ‌ర‌ద‌ల‌తో నిరాశ్ర‌యులైన వారికి అండ‌గా నిలిచేందుకు సినీ ప్ర‌ముఖులు ముందుకొస్తున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 10:25 pm, Tue, 20 October 20
వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా ప్రభాస్.. రూ. కోటి 50 ల‌క్ష‌లు విరాళం

హైదరాబాద్ మహాన‌గ‌రంలో వ‌ర‌ద‌ల‌తో నిరాశ్ర‌యులైన వారికి అండ‌గా నిలిచేందుకు సినీ ప్ర‌ముఖులు ముందుకొస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపు మేర‌కు టాలీవుడ్ హీరోలు త‌మ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాల‌ను ప్రకటిస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, మ‌హేశ్ బాబుతోపాటు ప‌లువురు న‌టులు విరాళాల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా యువ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఉప్పలపాటి సీఎం స‌హాయ నిధికి 1 కోటి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించి.. తన గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు.

హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది తనను ఎంతో కలచివేసిందని వారిని ఆదుకోవడానికి వారి సహాయార్ధం తెలంగాణ సీఎం సహయనిధి కి తన వంతు సాయం అందిస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.