వైజాగ్ గ్యాస్ లీక్: అక్కడ రైలు ఆపిన లోకో పైలట్లకు అస్వస్థత…

|

May 10, 2020 | 5:15 PM

విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఏపీలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేపింది. ఈ దుర్ఘ‌ట‌న‌తో ఎఫెక్ట్ అయిన‌ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గ్యాస్ లీక్ ప్రభావం లోకోపైలట్లపై పడింది. గోపాలపట్నం రైల్వేస్టేషన్‌లో ట్రైన్స్‌ నిలిపిన లోకో పైలట్లు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున గోపాలపట్నం సమీపంలో 45 నిమిషాల పాటు గూడ్స్‌ రైలు ఆగింది. ఆ సమయంలో అక్కడ గాలి పీల్చిన ఇద్దరు లోకోపైలట్లు శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడినట్లు స‌మాచారం. అపస్మారక […]

వైజాగ్ గ్యాస్ లీక్: అక్కడ రైలు ఆపిన లోకో పైలట్లకు అస్వస్థత...
Follow us on

విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఏపీలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేపింది. ఈ దుర్ఘ‌ట‌న‌తో ఎఫెక్ట్ అయిన‌ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గ్యాస్ లీక్ ప్రభావం లోకోపైలట్లపై పడింది. గోపాలపట్నం రైల్వేస్టేషన్‌లో ట్రైన్స్‌ నిలిపిన లోకో పైలట్లు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున గోపాలపట్నం సమీపంలో 45 నిమిషాల పాటు గూడ్స్‌ రైలు ఆగింది. ఆ సమయంలో అక్కడ గాలి పీల్చిన ఇద్దరు లోకోపైలట్లు శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడినట్లు స‌మాచారం. అపస్మారక స్థితికి చేరుకున్న లోకో పైలట్లను వెంట‌నే ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్‌ ఇచ్చిన తర్వాత వారి పరిస్థితి కుదుట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

స్టైరీన్‌ గ్యాస్‌ ప్రభావం వల్ల విశాఖలో ఇప్పటివరకు ఐదుగురు లోకో పైలట్లు అస్వస్థతకు గురయ్యారు. ట్రీట్మెంట్ అనంత‌రం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈఘటన తర్వాత ఆ రూట్ లో గూడ్స్‌ సహా మిగిలిన రైళ్లను నిలిపివేశారు అధికారులు. ఆ తర్వాత శనివారం తిరిగి రైల్వే సర్వీసుల్ని పునరుద్ధరించారు. మళ్లీ గూడ్సు రైలు రాకపోకలకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు.