AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఇంజనీరింగ్ ఫీజులు!

Good News To Students: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులను తగ్గించేందుకు విద్యాశాఖ కసరత్తులు ప్రారంభించింది. గతంలో కన్నా తక్కువగా ఉంటాయని.. ఈసారి కేవలం విద్య కోసం ఖర్చు చేసే వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయిస్తామని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. వచ్చే నెల రెండోవారంలో ఫీజులను నిర్ణయించి.. ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు. ఆయా కాలేజీల్లో ఉండే సౌకర్యాలు, […]

విద్యార్థులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఇంజనీరింగ్ ఫీజులు!
Ravi Kiran
|

Updated on: Jan 31, 2020 | 12:41 PM

Share

Good News To Students: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులను తగ్గించేందుకు విద్యాశాఖ కసరత్తులు ప్రారంభించింది. గతంలో కన్నా తక్కువగా ఉంటాయని.. ఈసారి కేవలం విద్య కోసం ఖర్చు చేసే వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయిస్తామని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. వచ్చే నెల రెండోవారంలో ఫీజులను నిర్ణయించి.. ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు.

  • ఆయా కాలేజీల్లో ఉండే సౌకర్యాలు, ప్రమాణాలు, వసతులను దృష్టిలో పెట్టుకుని ఫీజులను నిర్ణయిస్తాం.
  • ఫిబ్రవరి 4వరకు కాలేజీల వాదనలు విని.. ఆ నెల మధ్య వారంలో ఫీజులను ప్రకటిస్తాం
  • అటు మెడికల్, ఫార్మా కాలేజీల్లో కూడా కమిషన్ బృందాలు తనిఖీలు చేస్తుండగా.. వాటి ఫీజుల విధానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.
  • యూజీ, పీజీ, డిగ్రీ కోర్సులు, లా కోర్సులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల ఫీజులను కూడా ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషనే ఖరారు చేస్తుంది.
  • ఫిబ్రవరి 10వ తేదీలోపు అన్ని కాలేజీలూ తమ ఫీజుల పట్టికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
  • ఇక ఈ ఏడాది ఫీజుల నిర్ణయంలో కొంత జాప్యం కలగడం వల్ల 2020-21, 2022-23 విద్యాసంవత్సరాలకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది.
  • డిగ్రీ, పీజీ కోర్సులకు ఒకే రకమైన ఫీజుల అమలవుతాయి.
  • కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు కమిషన్ నిర్ధారించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. అలా కాదని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.
  • అంతేకాకుండా విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడితే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు గ్రీవెన్స్‌ సెల్‌‌ను కూడా ఏర్పాటు చేయనున్నాం.
  • విద్యార్థుల దగ్గర నుంచి ఏ కళాశాల ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను తీసుకోరాదు. కేవలం జిరాక్స్ కాపీలను వాటితో సరి చూసుకుని వెంటనే తిరిగి ఇచ్చేయాలి.
  • ఇకపోతే సరైన వసతులు లేని కాలేజీలకు కొంత గడువు ఇస్తాం.. ఆలోపు లోపాలను సరిదిద్దుకోకపోతే చర్యలు తీసుకుంటాం.

Follow Us
ఒక్కసారైనా చూడాల్సిన ఖజురహో అందాలు.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద
ఒక్కసారైనా చూడాల్సిన ఖజురహో అందాలు.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద
ఇంకా కొన్ని గంటలే.. ఆ తర్వాత తెలంగాణలో చికెన్ షాప్స్ అన్నీ బంద్..
ఇంకా కొన్ని గంటలే.. ఆ తర్వాత తెలంగాణలో చికెన్ షాప్స్ అన్నీ బంద్..
మీరు బోటిని సరైన పద్ధతిలో శుభ్రం చేస్తున్నారా ?
మీరు బోటిని సరైన పద్ధతిలో శుభ్రం చేస్తున్నారా ?
బాలయ్యను ఇంకా గొప్పగా చూపించాల్సింది.. డైరెక్టర్ వివి వినాయక్..
బాలయ్యను ఇంకా గొప్పగా చూపించాల్సింది.. డైరెక్టర్ వివి వినాయక్..
ఎవరేమన్నా.. నా 'నోట్‌బుక్' సెలబ్రేషన్స్‌ను ఆపేదేలేదు
ఎవరేమన్నా.. నా 'నోట్‌బుక్' సెలబ్రేషన్స్‌ను ఆపేదేలేదు
ఈ చిన్న పని చేయకపోతే రూ.300 గ్యాస్ సబ్సిడీ కట్..
ఈ చిన్న పని చేయకపోతే రూ.300 గ్యాస్ సబ్సిడీ కట్..
మహేష్ బాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.. డైరెక్టర్ కామెంట్స్..
మహేష్ బాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.. డైరెక్టర్ కామెంట్స్..
పక్క ఇల్లు మన ఇంటికి కంటే ఎత్తుగా ఉంటే ఇన్ని సమస్యలు వస్తాయా...?
పక్క ఇల్లు మన ఇంటికి కంటే ఎత్తుగా ఉంటే ఇన్ని సమస్యలు వస్తాయా...?
తెలుగు హీరోలలో వారిద్దరూ నాకు ఇష్టం, అద్భుతంగా నటిస్తారు..
తెలుగు హీరోలలో వారిద్దరూ నాకు ఇష్టం, అద్భుతంగా నటిస్తారు..
బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కేంద్రం నుంచి మరో అప్డేట్
బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కేంద్రం నుంచి మరో అప్డేట్