Good News To Hyderabad People: రాజధాని ప్రజలకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదవారి కోసం ఎల్లప్పుడూ పని చేస్తున్న దవాఖానాల సంఖ్యను తొందరలోనే పెంచనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలు పని చేస్తుండగా.. మరో 227 దవాఖానాలకు ఏర్పాటు చేయడానికి సీఎం కార్యాలయం మంజూరు చేసిందని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలోనే మరిన్ని ఆసుపత్రులను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
‘గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 123 దవాఖానాలకు పని చేస్తుండగా.. వాటికి తోడు మరో 227 బస్తీ దవాఖానాలను ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారన్నారు. దీనితో వచ్చే 3 నెలల్లో 150 వార్డుల్లో మొత్తం 350 బస్తీ దవాఖానాలు పని చేయనున్నాయి. పేదవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని’ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
In addition to the already functional 123 Basthi Dawakhanas, Hon’ble @TelanganaCMO has sanctioned 227 more taking the total number to 350 within @GHMCOnline To be opened in next 3 months
Delighted that the people of Hyderabad have endorsed and welcomed these dispensaries ? pic.twitter.com/A4TnHwASou
— KTR (@KTRTRS) February 12, 2020