భారీగా పెరిగిన బంగారం ధర

|

May 14, 2019 | 6:58 PM

దేశీయ మార్కెట్లో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఒక్కరోజులోనే గ్రాముకి రూ.43 పెరిగి అమాంతం పైకి ఎగిసింది పసిడి. మరోవైపు వెండి కూడా బంగారం దిశలోనే పయనించింది. ఈ నేపథ్యంలో కిలో వెండి రూ.50 పెరిగింది. నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..43 పెరిగి రూ.3,366 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.43 పెరిగి రూ.3,091 వద్ద కొనసాగుతోంది. అయితే, వెండి […]

భారీగా పెరిగిన బంగారం ధర
Follow us on

దేశీయ మార్కెట్లో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఒక్కరోజులోనే గ్రాముకి రూ.43 పెరిగి అమాంతం పైకి ఎగిసింది పసిడి. మరోవైపు వెండి కూడా బంగారం దిశలోనే పయనించింది. ఈ నేపథ్యంలో కిలో వెండి రూ.50 పెరిగింది. నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..43 పెరిగి రూ.3,366 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.43 పెరిగి రూ.3,091 వద్ద కొనసాగుతోంది. అయితే, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి… అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.40,400 కి లభిస్తోంది.

అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని షేర్ హోల్డర్స్  భావించారు. దీనికి తోడు దేశీయంగా నగల వ్యాపారులు, నాణేల తయారీ దారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దీంతో ఈ లోహాల ధరలు పెరిగినట్లు బులియన్‌ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,298డాలర్లు, ఔన్సు వెండి ధర 14.83 డాలర్లుగా ఉంది.