పసిడి ప్రియులకు గోల్డెన్ ఆఫర్… తగ్గిన బంగారం ధర..

|

Aug 24, 2020 | 12:41 PM

పసిడి పడిపోతోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధర నెమ్మది నెమ్మదిగా దిగివస్తోంది. బంగారం ప్రియులకు అందుబాటులోకి వచ్చేలా కనిపిస్తోంది. బంగారం ధర బాటలోనే వెండి కూడా...

పసిడి ప్రియులకు గోల్డెన్ ఆఫర్... తగ్గిన బంగారం ధర..
Follow us on

పసిడి పడిపోతోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధర నెమ్మది నెమ్మదిగా దిగివస్తోంది. బంగారం ప్రియులకు అందుబాటులోకి వచ్చేలా కనిపిస్తోంది. బంగారం ధర బాటలోనే వెండి కూడా దిగివస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో కూడా బంగారం పడిపోతోందని అంచనా.

బులియన్ మార్కెట్‌లో తాజాగా  బంగారం రేట్లు దిగొచ్చాయి. సోమవారం హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.390 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,070కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.350 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,490కి  లభిస్తోంది.

పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయణించింది. బులియన్ మార్కెట్‌లో వెండి ధర పతనమైంది. తాజాగా రూ.690 దిగిరాగా, గత వారం రోజుల్లో మొత్తంగా రూ.4700 వెండి ధర తగ్గింది. తాజాగా 1 కేజీ వెండి ధర ధర రూ.67,110 అయింది. దేశ వ్యాప్తంగా ఇదే ధర కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు నిపుణులు.