లాక్ డౌన్ సమయంలో అందనంత ఎత్తుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు మెల్లమెల్లగా దిగివస్తుంది. దేశీయంగా బంగారం ధర వరుసగా నాలుగో రోజూ తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.485 తగ్గి రూ.50,418కి చేరుకుంది. గత ట్రేడింగ్ లో 10 గ్రాముల పసిడి ధర రూ.50,903గా ఉంది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గడం ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర కూడా భారీగా పతనమైంది. ఢిల్లీలో కేజీ వెండి రూ.2081 మేర తగ్గి రూ.58,099కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1,854 డాలర్లు ఉండగా.. వెండి ఔన్స్ 22.12 డాలర్లు వద్ద కొనసాగుతుంది. అటు డాలరు విలువ పెరుగుతుండడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు