బంగారం ధర భారీగా దిగొచ్చిందోచ్…

|

Sep 21, 2020 | 9:13 PM

ఒడిదుడుకులకు లోనైన బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా దిగివచ్చాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీపై స్పష్టత కొరవడటం బంగారం ధరల పతనానికి దారితీసింది...

బంగారం ధర భారీగా దిగొచ్చిందోచ్...
Follow us on

రన్ రాజా రన్ అంటూ పరుగులు పెట్టిన పసిడికి బ్రేకులు పెడ్డాయి. ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న బంగారం నెమ్మదించింది. పండుగల సీజన్ వస్తుండటంతో సామాన్యులకు చేరువగా వస్తోంది. లాక్ డౌన్ సమయంలో భారీగా పెరిగిన గోల్డ్ నెమ్మదిగా తగ్గుతోంది. ‌

గత కొద్దిరోజులుగా ఒడిదుడుకులకు లోనైన బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా దిగివచ్చాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీపై స్పష్టత కొరవడటం బంగారం ధరల పతనానికి దారితీసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి‌ ధరలు దిగివచ్చాయి. ఎంసీఎక్స్‌ (MCX)లో 10 గ్రాముల బంగారం  రూ.805 తగ్గి రూ. 50,910దిగిరాగా, కిలో వెండి ఏకంగా రూ. 2151 పతనమై రూ. 65,726 పలికింది.

యూరప్‌లో పలు దేశాల్లో కఠిన నియంత్రణలను ప్రకటించడంతో బంగారం ధరలు మరింత పడిపోకుండా నిలువరించాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిడి ధరలు మరికొన్ని రోజులు ఒడిదుడుకులతో సాగుతాయని వారు అంటున్నారు. ఇక యూఎస్‌ ఫెడ్‌ చీఫ్‌ జెరోం పావెల్‌ త్వరలో అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల కమిటీ ఎదుట మాట్లాడనుండటంతో ఆయన ప్రకటనపై బంగారం ధరల తదుపరి దిశ ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.