భారీగా తగ్గిన బంగారం దిగుమతి.. రీజన్ ఏంటంటే?

| Edited By: Pardhasaradhi Peri

Feb 05, 2020 | 3:39 PM

ప్రస్తుతం పసిడి ధరలు భగభగా మండుతున్నాయి. అసలు బంగారం మాటంటేనే.. ఆనందపడే మహిళలు.. ఇప్పుడు నీరసం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతోన్న బంగారం ధరలు అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాయి. బంగారం కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. వచ్చే వారం, నెలలో తగ్గుతుంది కదా అని ఆశగా ఎదురు చూస్తోన్న వారికి నిరాశే మిగులుతోంది. అంతకంతకూ పసిడి ధరలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గే పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌తోనే.. మనదేశంలో […]

భారీగా తగ్గిన బంగారం దిగుమతి.. రీజన్ ఏంటంటే?
Follow us on

ప్రస్తుతం పసిడి ధరలు భగభగా మండుతున్నాయి. అసలు బంగారం మాటంటేనే.. ఆనందపడే మహిళలు.. ఇప్పుడు నీరసం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతోన్న బంగారం ధరలు అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాయి. బంగారం కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. వచ్చే వారం, నెలలో తగ్గుతుంది కదా అని ఆశగా ఎదురు చూస్తోన్న వారికి నిరాశే మిగులుతోంది. అంతకంతకూ పసిడి ధరలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గే పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌తోనే.. మనదేశంలో బంగారం దిగుమతి సగానికి సగం తగ్గిపోయిందట. గోల్డ్ ధరలు రికార్డు స్థాయికి పెరగడమే దీనికి కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆకాశానికి అంటిన ధరలతో.. కొనుగోలు దారులు ముందుకు రావడం లేదంటున్నారు. గత రెండు నెలలుగా బంగారం రూ.41 వేలు దాటింది. తాజాగా ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.41,645గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 38,780లుగా ఉంది.

అలాగే.. అటు పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎందుకంటే.. 2019వ సంవత్సరంలో కూడా బంగారంపై పెట్టుబడుల కారణంగా 21 శాతం లాభం చేకూరింది. దీంతో ఈ సంవత్సరం కూడా పసిడి ధరలు భారీగానే పెరిగి అవకాశం నెలకొంది. ఇక ఈ ఏడాది బంగారం ధర అరలక్ష పెరిగినా ఆశ్చర్యం పోనక్కర్లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.