బంగారం ధరలు ఆల్‌టైం రికార్డ్

|

Jul 23, 2020 | 5:48 AM

పసిడి కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. మళ్లీ భారీగా పెరిగింది. గత కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ.. డబుల్ స్పీడ్​తో బంగారం ధరలు పెరగటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పైపైకి చేరింది. వరుసగా పెరుగుతున్న ధరలు కొత్త కొనుగోలుదారులను భయపెడుతోంది. రెండు, మూడు రోజులుగా 2 వేల పైచిలుకు పెరుగుదలను నమోదు చేసిన 10 గ్రాముల బంగారం ఇవాళ ఏకంగా 50 వేల మార్కును దాటింది. తొలిసారిగా 10 గ్రాముల […]

బంగారం ధరలు ఆల్‌టైం రికార్డ్
Follow us on

పసిడి కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. మళ్లీ భారీగా పెరిగింది. గత కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ.. డబుల్ స్పీడ్​తో బంగారం ధరలు పెరగటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పైపైకి చేరింది. వరుసగా పెరుగుతున్న ధరలు కొత్త కొనుగోలుదారులను భయపెడుతోంది.

రెండు, మూడు రోజులుగా 2 వేల పైచిలుకు పెరుగుదలను నమోదు చేసిన 10 గ్రాముల బంగారం ఇవాళ ఏకంగా 50 వేల మార్కును దాటింది. తొలిసారిగా 10 గ్రాముల పసిడి రూ.50 వేల గరిష్ఠ స్థాయిని చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పరుగుల పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు పెరిగాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో పెరిగాయి.

ఇప్పటికే అమెరికా ఫెడ్ ప్యాకేజీ వల్ల డాలర్ వ్యాల్యూ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. మదుపరులు పుత్తడిపై పెట్టుబడులకు ఆసక్తి చూపడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక శాతం పెరగటం వల్ల తొమ్మిదేళ్ల గరిష్ఠానికి బంగారం ధర చేరింది.