‘గోధన్ న్యాయ్ యోజన్’ కిలో రూ.2లు ఆవు పేడ

|

Jul 21, 2020 | 7:30 AM

ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం గోధన్ న్యాయ్ యోజన్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రైతుల నుంచి రూ.2లకు కిలో ఆవు పేడను కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం..

గోధన్ న్యాయ్ యోజన్ కిలో రూ.2లు ఆవు పేడ
Follow us on

Godhan Nyay Yojana Launched in Chhattisgarh : ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం గోధన్ న్యాయ్ యోజన్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రైతుల నుంచి రూ.2లకు కిలో ఆవు పేడను కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇలా సేకరించిన పేడతో వర్మి కంపోస్ట్ తయారు చేస్తారు. అలా తయారు చేసిన వర్మి కంపోస్ట్ ను అన్నదాలకు అందిస్తారు. దీనితో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు పశువులకు సరైన పశుగ్రాసం లభిస్తుందని.. రైతులు లాభాలను అర్జిస్తారని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ పనులు మొదలవడానికి ముందు హరేలీ ఉత్సవంను అక్కడి రైతులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ పథకాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ప్రారంభించారు.