Godavari Boat Accident: ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న సీఎం జగన్‌

|

Sep 16, 2019 | 2:32 AM

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు. ప్రమాద స్థలికి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకోనున్న సీఎం జగన్… ఆ ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు. ఆ తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు పురపాలక కార్యాలయం వద్ద అధికారులతో ముఖ్యమంత్రి జగన్​ సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడనున్నారు. మృతుల […]

Godavari Boat Accident:  ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న సీఎం జగన్‌
Follow us on

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు. ప్రమాద స్థలికి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకోనున్న సీఎం జగన్… ఆ ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు. ఆ తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు పురపాలక కార్యాలయం వద్ద అధికారులతో ముఖ్యమంత్రి జగన్​ సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడనున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఇప్పటికే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రకటించారు.

బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. బోట్లు ప్రయాణానికి అనుకూలమా? కాదా క్షుణ్నంగా తనిఖీలు చేయాలన్నారు. బోట్ల లైసెన్స్‌లు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. నిపుణులతో మార్గదర్శకాలు తయారుచేయించి తనకు నివేదించాలని సుచించారు.

ప్రమాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్:

సహాయచర్యల కోసం పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద సమాచారం అందించడానికి టోల్‌ఫ్రీ నంబర్‌-1800-233-1077 ఏర్పాటు చేశారు. సమాచారం కావలసిన వాళ్లు.. ఈ నంబర్​కు చేసి వివరాలు అందించాలని కలెక్టర్ ముత్యాల రాజు తెలిపారు. గండిపోచమ్మ ఆలయానికి చేరుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.