వైజాగే బెటర్ ఆప్షన్: ఆ పత్రికల కథనాలు కల్పితాలే

|

Jan 29, 2020 | 5:20 PM

ఒకట్రెండు దినపత్రికల్లో వచ్చిన కథనాలపై జీఎన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ విశాఖపట్నం అనువైన ప్రదేశం కాదని చెప్పినట్లు వచ్చిన కథనాలను కమిటీకి సారథ్యం వహించిన జీఎన్‌రావు తోసిపుచ్చారు. విశాఖపట్నానికి తుఫాను ప్రమాదం వున్నప్పటికీ ఏపీ రాజధాని కావాల్సిన అన్ని అర్హతలు వైజాగ్‌కు వున్నాయని ఆయన వివరణ ఇచ్చారు. విశాఖ వద్దని తాము సూచించినట్లు వచ్చిన కథనాలను జీఎన్ రావు ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన జీఎన్ […]

వైజాగే బెటర్ ఆప్షన్: ఆ పత్రికల కథనాలు కల్పితాలే
Follow us on

ఒకట్రెండు దినపత్రికల్లో వచ్చిన కథనాలపై జీఎన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ విశాఖపట్నం అనువైన ప్రదేశం కాదని చెప్పినట్లు వచ్చిన కథనాలను కమిటీకి సారథ్యం వహించిన జీఎన్‌రావు తోసిపుచ్చారు. విశాఖపట్నానికి తుఫాను ప్రమాదం వున్నప్పటికీ ఏపీ రాజధాని కావాల్సిన అన్ని అర్హతలు వైజాగ్‌కు వున్నాయని ఆయన వివరణ ఇచ్చారు. విశాఖ వద్దని తాము సూచించినట్లు వచ్చిన కథనాలను జీఎన్ రావు ఖండించారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన జీఎన్ రావు.. పత్రికల్లో వచ్చిన కథనాలపై క్లారిటీ ఇచ్చారు. రాజధానిపై రిపోర్టు ఇవ్వడంలో తమపై ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారాయన. కమిటీలో అందరూ 40-50 ఏళ్ళ అనుభవం వున్నవారేనని, స్వచ్ఛందంగా తమ దృష్టికి వచ్చిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక ఇచ్చామని చెప్పారు.

కమిటీ సభ్యులంతా ఢిల్లీ, చెన్నై, బెంగుళూర్ నుండి వచ్చినవారని, వైజాగ్ అనేది అనువైన ప్రదేశమని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినందున తాము రిపోర్టులో అదే పొందుపరిచామని చెప్పారు జీఎన్ రావు. తుఫాన్లు కోస్టల్ ఏరియాలోనే వస్తాయన్నది అందరికీ తెలిసిందే.. తీరప్రాంతం కోతకు గురవవుతుందని చెప్పింది కూడా నిజమేనని ఆయనన్నారు. తుఫానులను తానేమీ ఆపలేను కానీ.. తుఫానుల ప్రభావానికి గురి కాని స్థలంలో క్యాపిటల్ నిర్మాణాలు జరుపుకోవాలని మాత్రం సూచించగలనని జీఎన్ రావు అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మించుకోవచ్చని రిపోర్ట్ ఇచ్చామని వివరించారు.

రీజియన్స్‌ని జోన్లుగా విభజిస్తే అభివృద్ధికి సులువుగా ఉంటుందని నివేదికలో పేర్కొన్నామని, కర్నూలులో హైకోర్ట్ పెడితే జిరాక్స్ సెంటర్‌లకే పరిమితమవుతుందనే వాదన తప్పని జీఎన్ రావు అన్నారు. చాలా మంది రైతులు తమ దగ్గరికి వచ్చి అభిప్రాయాలు చెప్పారని ఆయన వెల్లడించారు.