సంపన్నులపై కరోనా ట్యాక్స్‌.. ప్రభుత్వాలకు కుబేరుల లేఖ.. 

కోవిద్-19 సంక్షోభ సమయంలో.. మానవాళికి తమ వంతు సాయం చేస్తామంటూ కొందరు కుబేరులు ఉదారంగా ముందుకొచ్చారు. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకునేందుకు తమ వంటి అత్యంత సంపన్నులపై

సంపన్నులపై కరోనా ట్యాక్స్‌.. ప్రభుత్వాలకు కుబేరుల లేఖ.. 
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 5:45 AM

కోవిద్-19 సంక్షోభ సమయంలో.. మానవాళికి తమ వంతు సాయం చేస్తామంటూ కొందరు కుబేరులు ఉదారంగా ముందుకొచ్చారు. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకునేందుకు తమ వంటి అత్యంత సంపన్నులపై కోవిడ్‌-19 ట్యాక్స్‌ విధించాలని 80 మందికి పైగా మిలియనీర్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మానవత్వం కోసం మిలియనీర్లుగా తమను తాము అభివర్ణించుకున్న వీరంతా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో సంపన్నులపై కోవిడ్‌ పన్ను వసూలు చేయాలని కోరారు.

ప్రపంచ కుబేరులపై అధిక పన్నును సత్వరమే శాశ్వత ప్రాతిపదికన విధించాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఫిల్మ్‌ మేకర్‌ అభిగల్‌ డిస్నీ, స్క్రీన్‌రైటర్‌ రిచర్డ్‌ కర్టిస్‌, బెన్‌ అండ్‌ జెర్రీ ఐస్‌క్రీం సహ వ్యవస్ధాపకులు జెర్రీ గ్రీన్‌ఫీల్డ్‌, అమెరికన్‌ వ్యాపారవేత్త సిడ్నీ టోపాల్‌, న్యూజిలాండ్‌ రీటైలర్‌ స్టీఫెన్‌ టిండాల్‌ తదితర ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు. కోవిడ్‌-19 ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తమ వంటి మిలియనీర్లు ప్రపంచం కోలుకునేందుకు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని లేఖలో వారు స్పష్టం చేశారు.

Latest Articles