గ్రేటర్ రేస్‌లో కారు జోరు.!. పోస్టల్ బ్యాలెట్‌లో వెనుకబడ్డా.. తొలి రౌండ్‌లో మాత్రం గేర్ మార్చి దుమ్ము దులుపుతోంది. కొన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి.. మరికొన్ని స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆర్సీపురం, పటాన్‌చెరు, చందానగర్, చర్లపల్లిలో గులాబీ జెండా ఎగురుతోంది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బాలానగర్, కాప్రాలోనూ కారు జోరు చూపుతోంది. అలాగే మీర్‌పేట్ హెచ్‌బీకాలనీ, గచ్చిబౌలి, భారతీనగర్, శేరిలింగంపల్లి, గాజులరామారం, రామచంద్రాపురం, రంగారెడ్డినగర్, బోరబండ, కేపీహెచ్‌బీ, పటాన్‌చెరు, ఆర్సీపురం, మూసాపేట,బాలాజీనగర్‌లో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతోంది
అటు బీజేపీ కూడా సత్తా చాటుతోంది. గడ్డిఅన్నారం, చైతన్యపురి, ఆర్కేపురం, సరూర్‌నగర్, హయత్‌నగర్, గోషామహల్, బేగంబజార్, మంగళ్‌హాట్, సరూర్‌నగర్, చంపాపేట్, కొండాపూర్, గుడిమల్కాపూర్‌లో కాషాయ జెండా ఎగురుతోంది. ఆయా డివిజన్లలో విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది.
అటు కాంగ్రెస్, ఎంఐఎం తొలిరౌండ్‌లోనే బోణి కొట్టాయి. సులేమాన్‌నగర్, శాస్త్రిపురం, రాజేంద్రనగర్ మజ్లిస్ ఆధిక్యం కొనసాగుతోంది. ఉప్పల్‌లో కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది.