GHMC Election results 2020: మొదలైన ఓట్ల కౌంటింగ్.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లెక్కింపు.. తొలి ఫలితం మెహిదీపట్నం డివిజన్..!

|

Dec 04, 2020 | 8:31 AM

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు

GHMC Election results 2020: మొదలైన ఓట్ల కౌంటింగ్..  కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లెక్కింపు.. తొలి ఫలితం మెహిదీపట్నం డివిజన్..!
Follow us on

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్‌ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లను నియమించారు. ప్రతి టేబుల్‌ వద్ద సీసీ కెమెరాలతో కౌంటిగ్‌ ప్రక్రియ మొత్తం రికార్డు చేస్తున్నారు.

తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 74లక్షల 67,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్లను బాక్సుల్లో నుంచి తీసి 25 బ్యాలెట్ల చొప్పున బండిల్‌గా కడతారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు నిషేధించారు. అత్యంత తక్కువగా ఓట్లు పోలైన మెహిదీపట్నంలో మొదటి రౌండ్‌లోనే ఫలితం తేలనుంది. అత్యధికంగా ఓట్లు పోలైన మైలాన్‌దేవ్‌పల్లి డివిజన్‌తో పాటు మరో 11 డివిజన్లలో 3 రౌండ్లలో లెక్కింపు జరగనుంది.

  • 30 కౌంటింగ్‌ కేంద్రాల్లో 8,152 మంది సిబ్బంది
  • ఢిల్లీ నుంచి గల్లీ నేతల దాకా ఆసక్తిగా ఎదురుచూపులు
  • 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • 150 డివిజన్లకు సంబంధించి వార్డుకు ఒక కౌంటింగ్‌ హాల్‌
  • ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌
  • ఒక్కో టేబుల్‌పై గంటకు వెయ్యి చొప్పున 14వేల ఓట్లు లెక్కింపు
  • 28వేల లోపు ఓట్లు పోలైన డివిజన్‌ల్లో కౌంటింగ్‌ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే జయాపజయాలు ఖరారు
  • తక్కువ ఓట్లు పడిన మెహిదీపట్నం (11,818) నుంచి తొలి ఫలితం రావచ్చని భావన
  • ఎక్కువ ఓట్లు పడిన మైలార్‌దేవ్‌పల్లి – 37,445 ఓట్లు
  • మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ ఫలితం అన్నింటికంటే చివరన వచ్చే అవకాశం
  • మధ్యాహ్నంలోపు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది.
  • మొత్తానికి సాయంత్రానికే అన్ని డివిజన్ల ఫలితాలు
  • నాలుగు డివిజన్లలోనే ఎక్కువ ఓట్లు..
  • 150 డివిజన్లకుగాను నాలుగుచోట్ల మినహా ఎక్కడా పోలైన ఓట్లు 30వేలు దాటలేదు
  • లెక్కింపు మొదలైన మూడు రౌండ్లలోనే గెలిచేదెవరో.. ఓడేదెవరో తేలిపోనుంది
  • మధ్యాహ్నం 3 గంటలలోపు పార్టీల మెజార్టీలపై స్పష్టత
  • నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కింపు
  • ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ముగ్గురు అధికారులు, అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్‌ ఏజెంట్లు
  • ఆర్వోల నుంచి పాసులు, బ్యాడ్జీలు తీసుకున్న ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతి
  • ఒకవేళ అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా పద్ధతిలో ఫలితాలు ప్రకటన
  • రీ కౌంటింగ్‌ చేయించాలనుకునే అభ్యర్థులు ఫలితాలు ప్రకటించక ముందే ఆర్వోకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి.
  • డిసెంబ‌ర్ 1న జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోలైన మొత్తం ఓట్లు – 34,50,331
  • మహిళా ఓటర్లు 15,90,291
  • పురుషులు 18,60,040
  • అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్‌లో 67.71 శాతం పోలింగ్ నమోదు
  • అత్యల్పంగా యూసుఫ్‌గూడ డివిజన్‌లో 32.99 శాతం పోలింగ్
  • సర్కిళ్లవారీగా రామచంద్రాపురం పరిధిలోనే అత్యధికంగా 65.09 శాతం పోలింగ్‌
  • రెండో స్థానంలో గాజులరామారం – 53.65 శాతం
  • మూడోస్థానంలో చాంద్రాయణగుట్ట – 53.07 శాతం