14 వ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా జీసీ ముర్ము

|

Aug 07, 2020 | 1:03 PM

భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా గిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కొనసాగుతున్న ఆయన త్వరలో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ముర్ము భారతదేశపు 14 వ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ బాధ్యతలు చేపట్టనున్నారు.

14 వ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా జీసీ ముర్ము
Follow us on

భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా గిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కొనసాగుతున్న ఆయన త్వరలో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ముర్ము భారతదేశపు 14 వ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ బాధ్యతలు చేపట్టనున్నారు.

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన మరోసటి రోజే జీసీ ముర్ము భారతదేశ తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి) గా నియమితులయ్యారు. గిరీష్ చంద్ర ముర్మును తన కార్యాలయానికి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ గా నియామకం అమలులోకి వస్తుందని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖను రాష్ట్రపతి ఆదేశించారు. గత ఏడాది అక్టోబర్ 31 న శ్రీనగర్‌లోని రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జమ్మూ, కాశ్మీర్ గవర్నర్ గా ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన ముర్ము జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. అంతకు ముందు కేంద్ర వ్యయ కార్యదర్శిగా కూడా ముర్ము బాధ్యతలు నిర్వహించారు. ఇదిలావుంటే, ఉహించని పరిణామాల నడుమ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను భారత రాష్ట్రపతికి పంపారు. వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి.. భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఎజీ రాజీవ్ మెహ్రీషి పదవికాలం ఆగస్టు 7 శుక్రవారంతో ముగుస్తుంది. దీంతో ఆయన స్థానంలో ముర్ము కొనసాగనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిసి ముర్ము ఆ రాష్ట్ర హోం శాఖలో పనిచేశారు. అనంతరం మోదీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన పరోక్ష పన్ను సంస్కరణలను, వస్తువుల సేవల పన్ను పాలనను జాగ్రత్తగా చూసుకోవడానికి ముర్ముకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ముర్ము భారతదేశపు 14 వ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ బాధ్యతలు చేపట్టనున్నారు.