అఫ్రిదీ.. నిన్ను మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తా…

| Edited By:

May 04, 2019 | 8:53 PM

పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ తన ఆటోబయోగ్రఫీలో చెప్పిన కొన్ని విషయాలు వివాదాలకు తెరలేపాయి. తన అసలు వయసు ఎంతో చెప్పడంతో పాటు.. వివాదాస్పద కశ్మీర్ అంశాన్ని కూడా పుస్తకంలో లేవనెత్తాడు. ఇదే సమయంలో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. గంభీర్‌కు ఒక వ్యక్తిత్వం అంటూ లేదని… అత్యున్నతమైన క్రికెట్‌లో గంభీర్ ఒక క్యారెక్టర్ మాత్రమేనని అన్నాడు. ఈ నేపథ్యంలో అఫ్రిదీపై గంభీర్ విరుచుకుపడ్డాడు. అఫ్రిది ఒక వింత మనిషి అని […]

అఫ్రిదీ.. నిన్ను మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తా...
Follow us on

పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ తన ఆటోబయోగ్రఫీలో చెప్పిన కొన్ని విషయాలు వివాదాలకు తెరలేపాయి. తన అసలు వయసు ఎంతో చెప్పడంతో పాటు.. వివాదాస్పద కశ్మీర్ అంశాన్ని కూడా పుస్తకంలో లేవనెత్తాడు. ఇదే సమయంలో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. గంభీర్‌కు ఒక వ్యక్తిత్వం అంటూ లేదని… అత్యున్నతమైన క్రికెట్‌లో గంభీర్ ఒక క్యారెక్టర్ మాత్రమేనని అన్నాడు.

ఈ నేపథ్యంలో అఫ్రిదీపై గంభీర్ విరుచుకుపడ్డాడు. అఫ్రిది ఒక వింత మనిషి అని అన్నాడు. మెడికల్ టూరిజంలో భాగంగా పాకిస్థానీలకు భారత్ ఇప్పటికీ వీసాలు జారీ చేస్తోందని.. నిన్ను స్వయంగా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళతానని ట్వీట్ చేశాడు. అంతే కాదు ఆ ట్వీట్‌ని అఫ్రిదీకి ట్యాగ్ చేశాడు.