పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం ఆరా..

| Edited By:

Jun 30, 2020 | 9:16 AM

వైజాగ్ లో మరో విషవాయువు లీకైంది. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన ఇంకా మరిచిపోనేలేదు.. పరవాడ పారిశ్రామికవాడలో మరో కంపెనీలో గ్యాస్‌ లీక్‌ అయింది. సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో

పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం ఆరా..
Follow us on

వైజాగ్ లో మరో విషవాయువు లీకైంది. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన ఇంకా మరిచిపోనేలేదు.. పరవాడ పారిశ్రామికవాడలో మరో కంపెనీలో గ్యాస్‌ లీక్‌ అయింది. సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

పరవాడలోని ఫార్మాసిటీలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరు మృతి చెందారని, నలుగురు గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి 11.30గంటలకు ప్రమాదం జరిగిందని, వెంటనే జిల్లా కలెక్టర్‌, సీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారని, ముందు జాగ్రత్తగా పరిశ్రమను షట్‌డౌన్‌ చేయించారని పేర్కొన్నారు.

Also Read: ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!