AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలహాలు వద్దు.. కలిసి ముందుకు సాగుదాం: మోదీ, ట్రంప్ నిర్ణయం

జపాన్ వేదికగా జరిగిన జీ-20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం సహా పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఇరాన్, 5జి, వాణిజ్యం, రక్షణ సహకారం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. వాణిజ్యానికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ట్రంప్‌తో మోదీ చర్చించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతాపరమైన బంధాలను పెంపొందించుకోవడం, సాంకేతిక పురోగతిని అందిపుచ్చుకోవడం గురించి సంప్రదింపులు జరిపారు. […]

కలహాలు వద్దు.. కలిసి ముందుకు సాగుదాం: మోదీ, ట్రంప్ నిర్ణయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 2:23 PM

Share

జపాన్ వేదికగా జరిగిన జీ-20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం సహా పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఇరాన్, 5జి, వాణిజ్యం, రక్షణ సహకారం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. వాణిజ్యానికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ట్రంప్‌తో మోదీ చర్చించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతాపరమైన బంధాలను పెంపొందించుకోవడం, సాంకేతిక పురోగతిని అందిపుచ్చుకోవడం గురించి సంప్రదింపులు జరిపారు. అమెరికాతో ఆర్థిక సాంస్కృతికపరమైన బంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉందని మోడీ వ్యాఖ్యానించారు. దీనికి ముందు ట్రంప్, మోదీ.. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. తమ ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలనుకుంటున్న భారత్‌లాంటి దేశాలతో అమెరికా మెరుగైన సంబంధాలు కొనసాగించడానికి సిద్దంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

రెండు రోజుల జీ-20 సదస్సు శుక్రవారం ఆహ్లాదకరం వాతావరణం మధ్య ప్రారంభమైంది. ఘర్షణలు, వివాదాలకంటే సామరస్యత, అభివృద్ధి పై దృష్టి సారిద్దామని జపాన్ ప్రధాని షింజో అబే పిలుపునిచ్చారు. ఒక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడారు. జన్మర్ చాన్స్‌లర్ ఏంజెలా మార్కెల్ పై ప్రశంసలు కురిపించారు.

వందేమాతరం, జై శ్రీరామ్ నినాదాలతో జీ-20 సదస్సు మారుమోగింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబేతో పలు అంతర్జాతీయ వేదికలపై తను పాల్గొనే విధానం తమ మధ్య ఉ‍న్న స్నేహబంధం స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. 2014లో తాను భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత షింజో అబెతో దౌత్యపరమై సంబంధాలను ఇరు దేశాల ప్రజల్లోకి తీసుకువెళ్లామన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి భారతదేశ ప్రముఖులు స్వామి వివేకనందా, మహాత్మ గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులు జపాన్‌తో మంచి సంబంధాలను కొనసాగించారని తెలిపారు. రెండో ప్రపంచ యుద్దం అనంతరం భారత్‌, జపాన్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెరిగాయన్నారు ప్రధాని మోదీ.

ఉగ్రవాదం కారణంగా అమాయకులు చనిపోవడమే కాకుండా, ఆర్థికాభివృద్ధి కుంటుపడుతోందని, సామాజికంగానూ అస్థిరత నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమస్యగా మారిన ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. సమ్మిళిత ప్రపంచ అభివృద్ధికి దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.