హైదరాబాద్లోని బాలాపూర్ మండలం జల్లపల్లిలో కల్తీ కల్లు కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం కల్తీ కల్లు తాగి శ్రీనివాస్, రవి అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈరోజు ఉదయం శ్రీనివాస్ చనిపోగా, రవి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 5 రోజులుగా సుధాకర్ గౌడ్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఊళ్ళో కల్లు అమ్ముతున్నాడు. అయితే కల్లు దుకాణం ఉన్నట్టు కూడా తమకు తెలియదని స్థానికులు వాపోతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.