అనంతపురం జిల్లాలో కప్పల వర్షం

|

Aug 10, 2020 | 6:14 PM

తాడిపత్రిలో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో కురిసిన వర్షానికి ఆకాశం నుంచి కప్పలు పడ్డాయట. ఈ విషయాన్ని స్థానికులు ఘంటాపథంగా చెబుతున్నారు...

అనంతపురం జిల్లాలో కప్పల వర్షం
Follow us on

Frog rain in Anantapuram District: అనంతపురం జిల్లా నిన్న అర్ధరాత్రి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కారణంగా  చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు అన్ని వరద కాలువులను తలపిస్తున్నాయి.

గుంతకల్లు, తాడిపత్రితోపాటు జిలాల్లోని చాలా గ్రామాల్లో సాయంత్రం చిన్నగా మొదలైన వర్షం…తర్వాత ఏకధాటిగా రెండుగంటల పాటు కూడపోతగా కురిసింది. రాజేంద్ర నగర్లోని ఎక్సైజ్‌ స్టేషన్లోకి నీరు చేరడంతో స్టేషన్ పరిసరాలు నీటిలో మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు కనిపించకుండా వర్షం కురవడంతో వాహనదారులకు అంతరాయం ఏర్పడింది.

అయితే తాడిపత్రిలో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో కురిసిన వర్షానికి ఆకాశం నుంచి కప్పలు పడ్డాయట. ఈ విషయాన్ని స్థానికులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇలాంటి కప్పల వర్షం ఎప్పుడూ చూడలేదని తాడిపత్రి వాసులు ఆశ్చర్యానికి గురౌతున్నారు. వర్షంతోపాటు కప్పులు కురుస్తుండటంతో వింతకు లోనైనట్లుగా చెబతున్నారు.