ఏపీ డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..

కరోనా కాలంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు పలు ఆన్లైన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ ఫౌండేషన్, వెబ్ డెవలపింగ్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కోర్సులను ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఎండీ శ్రీకాంత్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఇదిలా […]

ఏపీ డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..

Updated on: Jun 27, 2020 | 1:10 PM

కరోనా కాలంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు పలు ఆన్లైన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ ఫౌండేషన్, వెబ్ డెవలపింగ్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కోర్సులను ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఎండీ శ్రీకాంత్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలన్నారు.

ఇదిలా ఉంటే శాటిలైట్ అనుబంధ అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి.. వాటిల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ముందుకొచ్చాయని తెలిపారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3 వరకు శిక్షణ ఉంటుందన్నారు. కాగా, మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://www.apssdc.in/home/ అఫీషియల్ వెబ్‌సైట్‌ను చూడండి.

Also Read:

ప్రైవేట్ స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్…

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..

నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు..

పాడి రైతులకు శుభవార్త.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

వారికి ఉచితంగా ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు..

‘బిగ్ బాస్ 4’కు హోస్టుగా సమంతా..?