తెలంగాణ : పేద‌ల‌కు తీపి క‌బురు…ప్రారంభ‌మైన‌ ఉచిత బియ్యం పంపిణీ

|

Jul 06, 2020 | 8:45 AM

కోవిడ్-19 కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం కరీంనగర్‌ జిల్లా చెర్లబూత్కూర్‌లో బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు.

తెలంగాణ : పేద‌ల‌కు తీపి క‌బురు...ప్రారంభ‌మైన‌ ఉచిత బియ్యం పంపిణీ
Follow us on

కోవిడ్-19 కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం కరీంనగర్‌ జిల్లా చెర్లబూత్కూర్‌లో బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌వ్యాప్తంగా 89 లక్షల కార్డుదారులకు 10 కిలోల ఉచితబియ్యం అదించనున్నారు. కేంద్రం నిర్ణయం నేప‌థ్యంలో 1.91 కోట్ల మందికి మాత్రమే 5 కేజీల బియ్యం పంపిణీ కానుండగా, తెలంగాణ స‌ర్కార్ అదనంగా మరో 89 లక్షల మందిని కలుపుకొని 2.80 కోట్ల మందికి బియ్యం అందిస్తుంద‌ని మంత్రి తెలిపారు. జూలై నుంచి నవంబర్‌ వరకు ఐదునెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని గంగుల వివ‌రించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజ‌న‌కంగా లేకున్నా, ఆదాయం పెద్ద‌గా లేకున్నా పేదలు ఆక‌లితో ఉండ‌కూడ‌ద‌న్న సంక‌ల్పంతో ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించామన్నా రు. ఈ నిర్ణ‌యంతో రాష్ట్ర ఖజానాపై నెలకు రూ. 50 కోట్ల ఆర్థిక భారం పడుతున్నదని, ఐదు నెలలకు రూ. 250 కోట్లు ఇందుకు ఖర్చు చేస్తున్నామని మంత్రి గంగుల వివ‌రించారు.