మనిషా..? పశువా..?..నాలుగేళ్ల చిన్నారిపై పెద్దనాన్న..

అసలు సొసైటీ ఎటు పోతుందో అర్ధం కావట్లేదు. ఆడపిల్లలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. లోకం తెలియని పసిపిల్లల్ని చిదిమేస్తున్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా..మన ఆడపిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాం. న్యూస్ చూసి, అయ్యో పాపం! అని వదిలేస్తున్నాం. కానీ ఏదో జరగాలి. జనాల మైండ్సెట్‌లో మార్పు రావాలి. తాజాగా జయశంకర్ భూపాలపల్లిలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. మహాముత్తారం మండలం కోనంపేటలో నాలుగేళ్ల చిన్నారిపై సొంత పెద్దనాన్నే లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి తల్లితో నిద్రిస్తున్న పాపను తీసుకెళ్లి అఘాయిత్యం […]

మనిషా..? పశువా..?..నాలుగేళ్ల చిన్నారిపై పెద్దనాన్న..

Updated on: Jan 01, 2020 | 5:45 PM

అసలు సొసైటీ ఎటు పోతుందో అర్ధం కావట్లేదు. ఆడపిల్లలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. లోకం తెలియని పసిపిల్లల్ని చిదిమేస్తున్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా..మన ఆడపిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాం. న్యూస్ చూసి, అయ్యో పాపం! అని వదిలేస్తున్నాం. కానీ ఏదో జరగాలి. జనాల మైండ్సెట్‌లో మార్పు రావాలి.

తాజాగా జయశంకర్ భూపాలపల్లిలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. మహాముత్తారం మండలం కోనంపేటలో నాలుగేళ్ల చిన్నారిపై సొంత పెద్దనాన్నే లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి తల్లితో నిద్రిస్తున్న పాపను తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. ఫిర్యాదు అందుకొన్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి..పరారిలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.