16 గంటల్లో 13వేల 993 కిలోమీటర్ల ప్రయాణం, ఓన్లీ లేడీ పైలెట్స్, నాన్ స్టాప్ జర్నీ.. శాన్‌ఫ్రాన్సిస్కో టు బెంగళూరు

World's longest flight route : భారత మహిళామణులు గగనతలంలోనూ తన సత్తాచాటారు. ప్రపంచంలోనే అది పెద్దదైన ఫ్లైట్ రూట్ లో ఏకబిగిన అనుకున్నది..

16 గంటల్లో 13వేల 993 కిలోమీటర్ల ప్రయాణం, ఓన్లీ లేడీ పైలెట్స్, నాన్ స్టాప్ జర్నీ.. శాన్‌ఫ్రాన్సిస్కో టు బెంగళూరు

Updated on: Jan 11, 2021 | 6:13 PM

World’s longest flight route : భారత మహిళామణులు గగనతలంలోనూ తమ సత్తాచాటారు. ప్రపంచంలోనే అది పెద్దదైన ఫ్లైట్ రూట్ లో ఏకబిగిన విమానం నడిపి అనుకున్నది సాధించారు. మహిళా పైలెట్లు, సిబ్బందితో 16 గంటలపాటు నాన్‌స్టాప్‌గా ప్రయాణించిన ఎయిరిండియా విమానం బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో బయలుదేరిన ఈ విమానం 16 గంటల్లో 13వేల 993 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకుంది. ఈ ఎయిరిండియా విమానానికి జోయా అగర్వాల్‌ ప్రధాన పైలెట్‌గా వ్యవహరించారు. ఆమెకు సహాయకులుగా తెలుగు తేజం కెప్టెన్‌ తన్మయి, కెప్టెన్‌ సోనావారే, కెప్టెన్‌ శివాని ఉన్నారు. మహిళా వైమానిక బృందానికి మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.