యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కి కరోనా

కరోనా మహమ్మారి వ్యాప్తి ఆగడంలేదు. వైరస్ బారినపడుతున్న ప్రముఖుల జాబిత క్రమంగా పెరుగుతుంది.

యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కి కరోనా

Updated on: Sep 14, 2020 | 9:09 PM

కరోనా మహమ్మారి వ్యాప్తి ఆగడంలేదు. వైరస్ బారినపడుతున్న ప్రముఖుల జాబిత క్రమంగా పెరుగుతుంది. కరోనా కట్టడికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. సామాన్యలతో పాటు ప్రజా ప్రతినిధులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సలహా మేరకు లక్నోలోని ఎస్జీపీజీఐ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారని ఆయన మనవడు, యూపీ రాష్ట్ర మంత్రి సందీప్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.