ఉద్యోగం ఊడిందని.. గొయ్యి తవ్వుకుని..

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాకు చెందిన విజయ్‌కుమార్ ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఓ విచిత్రమైన పని చేశాడు. కొద్ది రోజుల నుంచి క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఖాళీ ప్రదేశంలో తపస్సు చేసేందుకు సిద్దమయ్యాడు. అందుకోసం తనకు తాను సమాధి చేసుకునేందుకు గొయ్యి తవ్వుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు. గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విజయ్ కుమార్ ఉద్యోగం పోవడంతో.. […]

ఉద్యోగం ఊడిందని.. గొయ్యి తవ్వుకుని..

Edited By:

Updated on: Jul 03, 2019 | 11:56 AM

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాకు చెందిన విజయ్‌కుమార్ ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఓ విచిత్రమైన పని చేశాడు. కొద్ది రోజుల నుంచి క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఖాళీ ప్రదేశంలో తపస్సు చేసేందుకు సిద్దమయ్యాడు. అందుకోసం తనకు తాను సమాధి చేసుకునేందుకు గొయ్యి తవ్వుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు. గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విజయ్ కుమార్ ఉద్యోగం పోవడంతో.. మానసిక ఆందోళకు గురై ఇలా రకరకాల చేష్టలకు అలవాటు పడ్డాడు. మానసిక ఆందోళనతోనే ఈ విచిత్ర పనులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us