పరారీలో భూమా అఖిల ప్రియ భర్త..! పోలీసుల గాలింపు..!

| Edited By:

Oct 10, 2019 | 11:21 AM

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ కోసం ఆళ్లగడ్డ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత రెండ్రోజులుగా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఓ పోలీసుపై కారును పోనిచ్చాడన్న కేసులు కూడా భార్గవరామపై నమోదయ్యాయి. ప్రస్తుతం ఆళ్లగడ్డ పీఎస్‌లో రెండు కేసులు, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు నమోదు అయ్యాయి. రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లో భార్గవరామను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కారును ఆపినట్లే ఆపి.. ఆ తర్వాత […]

పరారీలో భూమా అఖిల ప్రియ భర్త..! పోలీసుల గాలింపు..!
Follow us on

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ కోసం ఆళ్లగడ్డ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత రెండ్రోజులుగా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఓ పోలీసుపై కారును పోనిచ్చాడన్న కేసులు కూడా భార్గవరామపై నమోదయ్యాయి. ప్రస్తుతం ఆళ్లగడ్డ పీఎస్‌లో రెండు కేసులు, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు నమోదు అయ్యాయి.

రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లో భార్గవరామను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కారును ఆపినట్లే ఆపి.. ఆ తర్వాత వేగంగా కారును డ్రైవ్ చేసుకుని వెళ్లాడని ఆళ్లగడ్డ ఎస్‌ఐ అంటున్నారు. అంతేకాదు కారును తమపైకే పోనిచ్చాడని ఎస్‌ సోమేష్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ అఖిలప్రియ భర్త కోసం గాలింపును ముమ్మరం చేసింది. ప్రస్తుతం అతనిపై ఐపీసీ సెక్షన్‌ 353, 336 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.