గౌతం గంభీర్‌కు కరోనా నెగెటివ్

కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు కొవిడ్‌-19 నెగెటివ్‌గా వచ్చిందని బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్ తెలిపాడు. ఈ విషయాన్ని అతడు ఆదివారం ట్విటర్‌లో వెల్లడించాడు.

గౌతం గంభీర్‌కు కరోనా నెగెటివ్

Updated on: Nov 08, 2020 | 5:10 PM

Gautam Gambhir : కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు కరోనా నెగెటివ్‌గా వచ్చిందని బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్ తెలిపారు. ఈ విషయాన్ని అతడు ట్విటర్‌లో వెల్లడించాడు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకడంతో గంభీర్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

తానకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని గంభీర్ వెల్లడించారు. ఆ విషయాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. కొవిడ్‌ టెస్టులో నెగెటివ్‌గా వచ్చిందని మీతో షేర్‌ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ వారితో పేర్కొన్నారు. మీ అందరి విషెస్‌కు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. సురక్షితంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేశారు.