మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూత

బీహార్ కు చెందిన ప్రముఖ రాజకీయవేత్త, ఆర్జేడీ మాజీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆదివారం కన్ను మూశారు. ఆయన వయస్సు 74 ఏళ్ళు. బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్..

  • Umakanth Rao
  • Publish Date - 12:54 pm, Sun, 13 September 20
మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూత

బీహార్ కు చెందిన ప్రముఖ రాజకీయవేత్త, ఆర్జేడీ మాజీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆదివారం కన్ను మూశారు. ఆయన వయస్సు 74 ఏళ్ళు. బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి చిరకాల సన్నిహితుడైన ఈయన ఇటీవలే ఈ పార్టీకి రాజీనామా చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో రఘువంశ్ ప్రసాద్ సింగ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించారు. గ్రామీణ, వ్యవసాయాభివృద్ది రంగంలో నిపుణుడిగా అయన ఎంతో పేరు పొందారు. గ్రామీణ ఉపాధి పథకం రూప కల్పనకు, దాని అమలుకు రఘువంశ్ ప్రసాద్ సింగ్ విశేషంగా కృషి చేశారు. బీహార్ లో వైశాలీ పార్లమెంటరీ నియోజకవర్గానికి అయిదు సార్లు ప్రాతినిధ్యం వహించిన రఘువంశ్ ప్రసాద్.. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఆర్జేడీ వీడిన అనంతరం ఈయన జేడీ-ఎస్ లో చేరవచ్చునని వార్తలు వఛ్చినప్పటికీ అవి నిర్ధారణ కాలేదు. ఆయన మృతికి పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపం ప్రకటించారు.