భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. కె-4 బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్ష విజయవంతమైంది. అందుకు మన విశాఖపట్నం తీరం వేదికైంది. 3500 కిలోమీటర్ల టార్గెట్స్‌ను ఈ క్షిపణి పూర్తిచేయగలదు. శుక్రవారం ఉదయం ఈ పరీక్ష జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) అభివృద్ది చేసిన ఈ మిస్సైల్‌ని.. టెస్ట్ చేయడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండోసారి. అంతకుముందు జనవరి 19న క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. అణ్వాయుధాలను తీసుకెళ్లి ప్రత్యర్థుల అంతు చూడగల సామర్థ్యం కె-4 మిస్సైల్ సొంతం. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలలో ఎక్కడినుంచైనా ఇది శత్రువులపై విరుచుకుపడగలదు. అరిహంత్ అణు జలాంతర్గాముల నుంచి ఎక్కుపెట్టేలా కె-4 క్షిపణులను రూపొందించారు. కె-4… 1.3 మీటర్ల వ్యాసం కలిగి ఉండి… దాదాపు 17 టన్నుల బరువుతో 12 మీటర్ల పొడవు ఉంటుంది. 2 వార్ హెడ్లను మోసుకెళ్లగలదు.