AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FZ1073లో అసలు ఏం జరిగింది? కోపైలట్ చుట్టూ మిస్టరీ.. దర్యాప్తు ఎవరి చేతుల్లో?

ఫ్లై దుబాయ్‌పై ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కానీ లోతైన ఇన్విస్టిగేషన్ ఎవరు చేయాలి కోపైలట్‌ను ఎవరు ప్రశ్నించాలి? సౌదీనా..? యూఏఈనా? ఇజ్రాయెలా? కాక్‌పిట్‌లో జరిగిన దాడి వెనుక అసలు కథేంటి..? ఇప్పుడీ ప్రశ్నలు చుట్టూనే దర్యాప్తు తిరుగుతోంది. కోపైలట్‌ విచారణకోసం ఐదు దేశాల పోటీ పడుతున్నాయి..మరి రూల్స్ ప్రకారం ఏదేశం కోపైలట్ కుట్రను బయటపెట్టబోతోంది ?

FZ1073లో అసలు ఏం జరిగింది? కోపైలట్ చుట్టూ మిస్టరీ.. దర్యాప్తు ఎవరి చేతుల్లో?
Flydubai Fz1073
Ram Naramaneni
|

Updated on: Oct 02, 2026 | 10:02 PM

Share

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. మొదట ఇది ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన ఘర్షణగా కనిపించినా.. కాక్‌పిట్‌లో అసలు ఏం జరిగింది? కోపైలట్ ఎందుకు కెప్టెన్‌పై దాడి చేశాడు? విమానం ఒక్కసారిగా కిందికి ఎందుకు దిగింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలను వెంటాడుతున్నాయి. అంతేకాదు.. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులు ఉండటం, కోపైలట్ జాతీయతపై వస్తున్న వివరాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. ఈ ఘటనను మరింత సున్నితమైన అంశంగా మార్చాయి. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా ఘర్షణ సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన FZ1073 విమానంలో ప్రయాణం మధ్యలో కాక్‌పిట్‌లో కెప్టెన్, కోపైలట్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పడంతో కోపైలట్ కెప్టెన్‌పై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో విమానం భారీగా కిందికి దిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు సిబ్బంది చర్యలు చేపట్టగా.. విమానం చివరకు సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్, కోపైలట్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే సౌదీ అధికారులు కోపైలట్‌ను అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. సౌదీలో మొదలైన విచారణ.. యూఏఈకి ఎందుకు? తబూక్‌లో విమానం దిగడంతో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి